అలెప్పో హింసపై అరబ్ లీగ్ ఆందోళన
- May 06, 2016
అరబ్ లీగ్, సిరియన్ సిటీ అలెప్పోలో జరుగుతున్న నేరాలపై ఆందోళన వ్యక్తం చేసింది. కౌరోలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో అరబ్ లీగ్ దేశాల ప్రతినిథులు పాల్గొన్నారు. అరబ్ లీగ్ ఎక్రెటరీ జనరల్ నబిల్ ఎలారబీ, ఖతార్ విజ్ఞప్తితో అలెప్పీపై ప్రత్యేక చర్చ చేపట్టారు. ఈజిప్ట్‌లోని ఖతార్ అంబాసిడర్ మరియు అరబ్ లీగ్ శాశ్వత ప్రతినిథి సైఫ్ బిన్ ముకద్దమ్ అల్ బువాయినైన్ మాట్లాడుతూ, అలెప్పోలో జరుగుతున్న నేరాలు తక్షణం ఆగాల్సి ఉందనీ, అక్కడి పౌరులు అభద్రతతో జీవిస్తున్నారని ప్రారంభ ప్రసంగంలో పేర్కొన్నారు. ఏప్రిల్ 22 నుంచి అలెప్పోలో జరుగుతున్న దాడుల్లో 280 మంది పౌరులు మృతి చెందారు. తిరుగుబాటుదారులు నగరంపై పట్టు కోసం హేయమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని కైరోలో జరిగిన అరబ్ లీగ్ సమావేశంలో ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్‌లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?









