అట్టహాసంగా NTR30 మూవీ ఓపెనింగ్
- March 23, 2023
హైదరాబాద్: ఎన్టీఆర్–కొరటాల శివ కలయికలో తెరకెక్కబోయే NTR30 మూవీ ఓపెనింగ్ కార్యక్రమాలు ఈరోజు గురువారం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగాయి. వాస్తవానికి గత నెలలోనే ఈ మూవీ ప్రారంభోత్సవం జరగాల్సి ఉన్నప్పటికీ.. తారకరత్న అకాల మరణంతో అది కాస్త వాయిదా పడింది. ఫైనల్ గా ఈరోజు గురువారం(మార్చి 23) పూర్తి చేసుకుంది. హైదరాబాద్ లో గ్రాండ్ గా పూజా కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్స్ తోపాటు పలువురు నటీనటులు విచ్చేసి సందడి చేశారు.
‘ఆర్ఆర్ఆర్’తో తన రేంజ్ ని ఓ రేంజ్ లో పెంచేసుకున్న ఎన్టీఆర్, తర్వాతి సినిమా విషయంలో పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. అందుకే దాదాపు ఏడాది సమయం తీసుకుని మరీ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. తనతో ‘జనతా గ్యారేజ్’ తీసి హిట్ కొట్టిన కొరటాల శివనే తన మూవీ సినిమాకు డైరెక్టర్ గా ఎన్టీఆర్ ఎంచుకున్నారు. అలాగే హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించబోతుంది. ఈ సినిమా తో జాన్వీ తెలుగు లో ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇదిలా ఉండగా అనిరుధ్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నాడు.
నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ సంస్థ పై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్ హరికృష్ణ కె నిర్మిస్తున్న చిత్రం ఇది. కొరటాల శివ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి షాట్ కు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా… శ్యాంప్రసాద్ రెడ్డి సినిమా స్క్రిప్టును అప్పగించారు.
హిందీ నిర్మాత టి సిరీస్ భూషణ్ కుమార్ తెలుగు నిర్మాతల్లో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ ఎర్నేని కేఎస్ రామారావు అభిషేక్ అగర్వాల్ నటులు ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు.
తాజా వార్తలు
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!