వ్యకిని గుండెపోటు నుంచి కాపాడిన ఆపిల్ స్మార్ట్‌వాచ్!
- March 24, 2023
యూఏఈ : నెదల్ మహ్మద్ అల్ రెహ్మాన్ అనే యూఏఈ జాతీయుడిని గుండెపోటు నుంచి ఆపిల్ స్మార్ట్ వాచ్ కాపాడింది. అల్ రెహ్మాన్ తన స్నేహితులతో చాట్ చేస్తున్నప్పుడు అతని స్మార్ట్ వాచ్ అకస్మాత్తుగా బీప్ సౌండ్ చేయడం ప్రారంభించింది. ఆ హెచ్చరికలను అతను పట్టించుకోలేదు. తన స్నేహితులతో చాటింగ్ చేస్తూనే ఉన్నాడు. కొద్ది రోజులపాటు తన స్మార్ట్ వాచ్ ఆరోగ్య హెచ్చరికలను పంపుతూనే ఉంది. "అప్పటికి రెండు నుండి మూడు రోజులు గడిచిపోయాయి. కానీ హెచ్చరికలు ఆగకపోవడంతో డాక్టర్స్ ను సంప్రదించాను." అని అల్ రెహ్మాన్ తెలిపారు. గత 20 సంవత్సరాలుగా అల్ రెహ్మాన్ మధుమేహ వ్యాధిగ్రస్థుడు. ఆరోగ్య హెచ్చరికలు వచ్చినప్పటికీ తనకు ఎలాంటి శారీరక అసౌకర్యం కలుగలేదని, కానీ ఒక వైద్యుడు తన వైద్య పరీక్షల నివేదికలను చూసి ఆశ్చర్యపోయాడని వివరించాడు. “నేను గుండెపోటు అంచున ఉన్నానని డాక్టర్ చెప్పారు. అతను యాంజియోగ్రామ్ చేసాడు. తరువాత యాంజియోప్లాస్టీ చేసాడు. నా ధమనులు(ఆర్టెరీస్ ) 70 నుండి 80 శాతం పూర్తిగా మూసుకుపోయాయని అతను చెప్పాడు” అని UAE పౌరుడు చెప్పాడు. తనను గుండెపోటు నుంచి కాపాడిన తన ఆపిల్ వాచ్‌కి జీవితాంతం రుణపడి ఉంటానాని అల్ రెహ్మాన్ చెప్పారు. "స్మార్ట్ వాచ్ నోటిఫికేషన్లు లేకుంటే, నేను ప్రస్తుతం ఎక్కడ ఉంటానో నాకు ఖచ్చితంగా తెలియదు. బదులుగా నేను సాధారణ వాచ్‌ని ధరించి ఉంటే ఏమి జరుగుతుందో ఆలోచిస్తేనే భయంగా ఉంది," అని అతను చెప్పాడు. ఇది జరిగిన ఆరు నెలల తర్వాత అల్ రహ్మాకు ఓపెన్ హార్ట్ సర్జరీ ఆయింది. "నా దగ్గర మూడు యాపిల్ వాచీలు ఉన్నాయి. ఇప్పుడు నేను నిద్రపోతున్నప్పుడు కూడా ఈ గడియారాన్ని ధరిస్తాను" అని వెల్లడించారు. అల్ రెహ్మాన్ ఒకప్పుడు దుబల్(ఇప్పుడు ఎమిరేట్స్ గ్లోబల్ అల్యూమినియం (EGA))లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేశారు. తన సన్నిహిత మిత్రుడు, డాక్టర్ మన్సూర్ అన్వర్ హబీబ్.. మరింత మంది ప్రాణాలను రక్షించడానికి స్ఫూర్తిగా ఉంటుందని చెప్పడంతో జరిగిన విషయాన్ని మీడియాతో పంచుకున్నట్లు అల్ రెహ్మాన్ తెలిపారు.
"నిమిషానికి 100 బీట్ల కంటే ఎక్కువ హృదయ స్పందన రేటు, సక్రమంగా లేని రిథమ్ మరియు తక్కువ కార్డియాక్ ఫిట్నెస్ స్కోర్లతో సహా గుండె ఆరోగ్యాన్ని అంచనా వేసేటప్పుడు అనేక సూచికలను పర్యవేక్షించడం చాలా కీలకం" అని కుటుంబ ప్రఖ్యాత కన్సల్టెంట్ డాక్టర్ హబీబ్ అన్నారు. స్మార్ట్‌వాచ్ లేదా ధరించగలిగిన గాడ్జెట్ వారానికి ఒకటి కంటే ఎక్కువ అలారంలను పంపితే వైద్యుడిని సంప్రదించమని సూచించారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







