టీఏకేటీ గ్రూప్‌తో APSSDC, APNRTS ఒప్పందం...
- March 24, 2023అమరావతి: రాష్ట్ర యువత విదేశాల్లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ముందడుగు వేసింది.మిడిల్ ఈస్ట్, యూరప్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, అమెరికా తదితర దేశాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. ఇందులో భాగంగా గురువారం తాడేపల్లిలోని APSSDC కార్యాలయంలో టీఏకేటీ గ్రూప్‌తో APSSDC, APNRTS త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి.
నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ సత్యనారాయణ, APNRTS ప్రెసిడెంట్ వెంకట్ ఎస్ మేడపాటి, టీఏకేటీ గ్రూప్ ఎండీ రాజ్‌సింగ్ సమక్షంలో పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా వైద్యం, నిర్మాణం, ఆతిథ్య రంగాల్లోని విదేశీ అవకాశాలపై టీఏకేటీ గ్రూప్ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. తొలి దశలో జర్మనీలోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు 15 మంది నర్సింగ్ అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు.
వీరికి జర్మనీ భాష పై 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.వీసా ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏప్రిల్‌లో జర్మనీకి పంపిస్తారు. అలాగే సీఎం వైఎస్ జగన్ ఆదేశాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు 192 స్కిల్ హబ్స్, 26 స్కిల్ కాలేజీలు, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏపీఎస్ఎస్డీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు