పౌర విమానయాన రంగంలో ఖతార్ మరో ఘనత
- March 25, 2023
దోహా: అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ(ICAO) నిర్దేశాల అమలులో దోహా ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్, ఖతార్ గగనతలాన్ని పూర్తిగా నిర్వహించడం ప్రారంభించిందని ఖతార్‌లోని సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) ప్రకటించింది. దోహా ఎఫ్‌ఐఆర్ స్కైస్‌ను పూర్తిగా నేల స్థాయి నుండి అంతర్జాతీయ జలాల్లోని కొన్ని ప్రాంతాలను నిర్వహించే మొదటి దశ పూర్తయినట్లు వెల్లడించింది. CAA ప్రకారం..ICAO చారిత్రాత్మక నిర్ణయం ఖతార్ రాష్ట్రాన్ని తన గగనతలాన్ని నిర్వహించడానికి, దోహా ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్‌ను స్థాపించడానికి అనుమతించడంపై ఖతార్ రవాణా మంత్రి HE జాసిమ్ బిన్ సైఫ్ అల్-సులైతి హర్షం వ్యక్తం చేశారు. ఖతార్‌లోని పౌర విమానయాన వ్యవస్థకు అంతర్జాతీయ విశ్వాసానికి ఇదే తిరుగులేని సాక్ష్యమని పేర్కొన్నారు. గత సంవత్సరం మార్చిలో రవాణా మంత్రిత్వ శాఖ ICAO కౌన్సిల్ దోహా ఎఫ్‌ఐఆర్ ఏర్పాటుకు అంగీకరించిందని గుర్తు చేశారు. దోహా ఎఫ్‌ఐఆర్ మొదటి దశ అమలులో ఖతార్ కొత్త విమాన మార్గాలను చూస్తుందని, గగనతలంలో ఉన్నప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్ వెయిటింగ్ ఏరియా సామర్థ్యం పెంచుతుందని గతేడాది ఈ సందర్భంగా హెచ్‌ఈ జస్సిమ్ బిన్ సైఫ్ అల్-సులైతి అన్నారు. పెద్ద ఎయిర్ ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా ఖతార్ గగనతలంలో ముఖ్యమైన విమాన మార్గాల సంఖ్యలో పెరుగుదలను కూడా చూడవచ్చని అల్-సులైతి వివరించారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







