హైదరాబాద్ లో అగ్నిప్రమాదం..సెక్యూరిటీగార్డ్ సజీవదహనం
- March 25, 2023
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో గత కొద్దీ రోజులుగా వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.ఈ ప్రమాదాల వల్ల ఇప్పటికే పలువురు మరణించడం జరిగింది. వారం రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించడం జరిగింది.ఈ ఘటన గురించి ఇంకా నగరవాసులు మాట్లాడుకుంటుండగానే…తాజాగా అబిడ్స్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
అబిడ్స్‌లోని బొగ్గుల కుంట కామినేని హాస్పిటల్ పక్కనే ఉన్న కారు మెకానిక్ షెడ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా గ్యారేజీ మొత్తానికి మంటలు వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.ఈ ప్రమాదంలో ఏడు కార్లు దగ్ధమయ్యాయని పోలీసులు తెలిపారు. కారులో నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డ్ సంతోష్ సజీవదహనం అయ్యాడని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
మరోపక్క తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవికాలంలో అగ్ని ప్రమాదాలకు ఎక్కువగా ఆస్కారం ఉన్న నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది సెలవులు తీసుకోవద్దు అంటూ ఫైర్ సేఫ్టీ డిజీ నాగిరెడ్డి ఆదేశాలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితులకు మినహాయింపు ఇచ్చారు. ఫైర్ స్టేషన్లలోని రక్షణ సామాగ్రి సహా పరికరాలు అన్నింటినీ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రమాద స్థలికి త్వరగా వెళ్లేందుకు గ్రీన్ ఛానల్ కోసం ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవాలన్నారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







