భిక్షాటన చేస్తే Dhs5,000 జరిమానా, జైలుశిక్ష!

- March 25, 2023 , by Maagulf
భిక్షాటన చేస్తే Dhs5,000 జరిమానా, జైలుశిక్ష!

యూఏఈ: వీధుల్లో భిక్షాటన చేస్తే 5 వేల దిర్హాంల జరిమానా విధించడంతోపాటు జైలుశిక్ష కూడా విధించే అవకాశం ఉందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (పిపి) హెచ్చరించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలలో ఓ వీడియోను విడుదల చేసింది. నేరాలు, జరిమానాల చట్టాన్ని ఆమోదించడంలో ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 31 2021లోని ఆర్టికల్ 475 ప్రకారం.. ఎవరైనా భౌతిక ప్రయోజనం లేదా ఏదైనా రూపంలో లేదా ఏదైనా ప్రయోజనం కోసం అభ్యర్థించడం ద్వారా యాచించడం నేరామని పేర్కొంది. భిక్షాటన చేస్తూ దొరికిన వారికి 3 నెలలకు మించకుండా జైలు శిక్ష విధించబడుతుందని, Dhs 5,000 కంటే తక్కువ కాకుండా జరిమానా విధించబడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com