కొత్త ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్‌ ప్రకటించిన ‘తమ్‌కీన్’

- March 25, 2023 , by Maagulf
కొత్త ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్‌ ప్రకటించిన ‘తమ్‌కీన్’

బహ్రెయిన్: లేబర్ ఫండ్ నిర్వహించే తమ్‌కీన్ (Tamkeen) కొత్త ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. మూడు సంవత్సరాల కంటే తక్కువ కాలం పాటు పనిచేస్తున్న బహ్రెయిన్ వ్యాపారాలకు సహాయం చేయడానికి ప్రీ-యాక్సిలరేషన్ లేదా ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. తమ్‌కీన్ ప్రకారం.. వ్యాపారాలకు మెంటార్‌షిప్, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ సపోర్ట్, నైపుణ్యం, ప్రోటోటైపింగ్ సౌకర్యాలను అందించడం ప్రాజెక్ట్ లక్ష్యం. తమ్‌కీన్ వ్యాపారాలకు ఉత్పత్తి డెలివరీలను చేరుకోవడంలో సహాయం చేస్తుంది. ప్రఖ్యాత ఇంక్యుబేటర్‌లతో భాగస్వామ్యం ద్వారా వ్యాపార అభివృద్ధికి మద్దతును అందిస్తుంది. ఈ ప్రయత్నాలు బహ్రెయిన్ జాతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, మరింత అభివృద్ధి చేయడంతోపాటు ప్రైవేట్ రంగం, జాతీయ శ్రామికశక్తికి కూడా ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో చేపట్టినట్లు తమ్‌కీన్ వెల్లడించింది. 2006లో ప్రారంభమైనప్పటి నుండి తమ్‌కీన్ ప్రైవేట్ రంగానికి.. ప్రత్యేకించి SMEలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా శిక్షణ, ఉపాధికి మద్దతు ఇవ్వడానికి BHD 2 బిలియన్లను పెట్టుబడిగా పెట్టింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com