అన్నతో వివాదం తర్వాత ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చిన మంచు మనోజ్
- March 27, 2023
మంచు విష్ణు – మనోజ్ ల మధ్య గొడవలు నడుస్తున్నట్లు తాజాగా మనోజ్ పోస్ట్ చేసిన వీడియో తో బయటపడిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు మంచు ఫ్యామిలీ లో ఎలాంటి గొడవలు లేవని అంత బాగానే ఉన్నారని అంత అనుకున్నారు. కానీ మనోజ్ పోస్ట్ చేసిన వీడియో తో అన్నదమ్ముల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు నడుస్తున్నాయని అర్థమైంది. ఈ గొడవఫై మోహన్ బాబు , మంచు లక్ష్మి , విష్ణు లు స్పందించారు కానీ మనోజ్ మాత్రం స్పందించలేదు.
ఈరోజు మీడియా ముందుకు వచ్చేసరికి అంత ఈ వివాదం గురించి మాట్లాడతాడని అనుకున్నారు కానీ మనోజ్ మాత్రం స్పందించలేదు. రియల్ స్టార్, దివంగత నటుడు శ్రీహరి కొడుకు మేఘాన్ష్ కొత్త సినిమా ప్రారంభోత్సవంలో మంచు మనోజ్ సందడి చేశారు. ఈ సందర్భంగా తన బుజ్జి తమ్ముడి సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నానని మనోజ్ చెప్పారు. ‘వాట్ ద ఫిష్’ అనే చిత్రంతోపాటు త్వరలోనే తాను ఓ సినిమా స్టార్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ‘‘కొత్త జీవితాన్ని ప్రారంభించాను. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. మాకొక సంతోషకరమైన జీవితాన్నిఇస్తారని ఆ దేవుడిని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ‘‘నాకు సినిమానే లైఫ్. మీరే (ప్రేక్షకులే) నా జీవితం. సినిమా లేకపోతే నాకేమీ లేదు. మళ్లీ సినిమాకే వస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. అయితే మంచు విష్ణుకు, తనకు మధ్య జరిగిన వివాదంపై మాత్రం స్పందించలేదు.
తాజా వార్తలు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!







