‘గేమ్ ఛేంజర్’గా రామ్ చరణ్.!
- March 27, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరన్ బర్త్‌డే సందర్భంగా ఈ రోజు ఆయన తాజా చిత్రానికి సంబంధించి టైటిల్ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి సంబంధించి అనేక రకాల టైటిల్స్ పరిశీలనలో వున్నాయ్ ఇంతవరకూ.
వాటన్నింటినీ తిప్పి కొడుతూ ఓ సరికొత్త టైటిల్‌ని రామ్ చరణ్ సినిమాకి ఫిక్స్ చేస్తూ అందరికీ షాకిచ్చింది శంకర్ అండ్ టీమ్. ‘గేమ్ ఛేంజర్’ అనే టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు.
ఈ టైటిల్‌పై ఫ్యాన్స్ ఫుల్ శాటిస్‌ఫైడ్‌గా వున్నారు. చాలా క్యాచీగా వుంది ఈ టైటిల్. టైటిల్‌ని బట్టి సినిమా పక్కా హిట్టు సినిమా.. అని ఫిక్సయిపోతున్నారు. కాగా, పక్కా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు డిఫరెంట్ వేరియేషన్స్ వున్న పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో దిల్ రాజుతో పాటూ, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!







