డయాబెటిస్ రోగులకి ఈ ఆకులు ఓ ఔషధం.!

- March 27, 2023 , by Maagulf
డయాబెటిస్ రోగులకి ఈ ఆకులు ఓ ఔషధం.!

సీతాఫలం ఎంతో బలం అంటారు. అవును నిజమే బలమే కాదు, ఎంతో రుచికరం కూడా ఈ ఫలం. అయితే, ఈ పండులో అధిక మోతాదులో చక్కెర స్థాయిలు వుండడం వల్ల డయాబెటిస్ వున్న వాళ్లు ఈ పండుకు దూరంగా వుండమని సూచిస్తుంటారు.

అయితే, సీతా ఫలం.. పండు సంగతెలా వున్నా వీటి ఆకులు మాత్రం డయాబెటిక్ రోగులకు ఓ వరమే అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. 

ఆయుర్వేదపరంగానే కాదు, వైద్య ప్రామాణికంగానూ ఈ ఆకులకు డయాబెటిస్ తగ్గించే శక్తి వుందని కొన్ని అధ్యయనాల ద్వారా వెల్లడైంది. 

రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో వుంచడం ద్వారా డయాబెటిస్‌ని అదుపులో వుంచొచ్చు. సీతాఫలం ఆకుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నట్లు తాజా అధ్యయనాల్లో బయటపడింది. ఈ ఆకులను తినడం వల్ల ప్యాంక్రియాసిస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో వుంటాయట. 

సో, డయాబెటిక్ రోగులకు ఈ ఆకులు చాలా ఉపయోగకరమైనవిగా చెబుతున్నారు. రోజూ రెండు ఆకులను నమిలి తినడం వల్ల షుగర్ అదుపులో వుంటుందంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com