వేసవి ఏర్పాట్ల పై టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమీక్ష
- March 27, 2023
తిరుమల: వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దష్టిలో పెట్టుకొని పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సోమవారం తిరుమలలో వేసవి ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఏప్రిల్ 1 నుంచి నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్టు. అలిపిరి నడక దారిలో రోజుకు 10వేల టోకెన్లు శ్రీవారి మెట్టు నడకదారిలో రోజుకు 5వేల టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. వేసవిలో బ్రేక్ సిఫారసు లేఖలను తగ్గిస్తామన్నారు. ముఖ గుర్తింపుతో పారదర్శకంగా వసతి సౌకర్యం కేటాయింపులు చేయనున్నట్టు తెలిపారు. వేసవిలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందుల లేకుండా ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







