ఒమన్‌లో వర్ష సూచన.. పాఠశాలలకు సెలవు
- March 28, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో మంగళవారం భారీ వర్షాల సూచనలు ఉన్న కారణంగా ఒమన్ సుల్తానేట్ ఉత్తర గవర్నరేట్‌లలో పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ముసండం, నార్త్ అల్ బటినా, అల్ బురైమి, అల్ దహిరా గవర్నరేట్‌లలో మార్చి 28న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మార్చి 29న పాఠశాలలు పునఃప్రారంభించబడతాయని విద్యా మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది. నేషనల్ సెంటర్ ఫర్ ఎర్లీ వార్నింగ్ ఆఫ్ మల్టిపుల్ హజార్డ్స్ (NCEWMH), మినిస్ట్రీలో ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ కోసం సెంట్రల్ కమిటీ జారీ చేసిన హెచ్చరిక నంబర్ (1)కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థుల భద్రతకు సంబంధిత అధికారులతో వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తునట్లు తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







