న్యూయార్క్-నెవార్క్, దుబాయ్ మధ్య నాన్‌స్టాప్ సర్వీసులు ప్రారంభం

- March 28, 2023 , by Maagulf
న్యూయార్క్-నెవార్క్, దుబాయ్ మధ్య నాన్‌స్టాప్ సర్వీసులు ప్రారంభం

యూఏఈ: న్యూయార్క్/నెవార్క్ హబ్, దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) మధ్య నాన్‌స్టాప్ డైలీ సర్వీస్‌ను యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రారంభించింది. ఈ విమానయాన సంస్థ 2016లో ఈ సర్వీసును నిలిపివేసింది. బోయింగ్ 777-200ER విమానం ద్వారా డైలీ సర్వీసులను నిర్వహించనున్నట్లు ఎయిర్ లైన్స్ ప్రకటించింది. దీని ద్వారా యూఎస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది గమ్యస్థానాలకు ప్రయాణికులు వెళ్లవచ్చని తెలిపింది. అదే విధంగా యుఎస్ నుండి దుబాయ్‌కి వచ్చే ప్రయాణికులు ఎమిరేట్స్ లేదా ఫ్లైదుబాయ్‌తో 100 కంటే ఎక్కువ విభిన్న నగరాలకు ప్రయాణించవచ్చని పేర్కొంది. దుబాయ్ నుండి న్యూయార్క్‌కు ప్రయాణించే ప్రయాణీకులు అమెరికా అంతటా 80కి పైగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చన్నారు. గ్లోబల్ నెట్‌వర్క్ ప్లానింగ్, అలయన్స్‌ల యునైటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాట్రిక్ క్వేల్ మాట్లాడుతూ.. న్యూయార్క్/నెవార్క్, దుబాయ్ మధ్య తమ కొత్త సర్వీస్, ఎమిరేట్స్ - ఫ్లైదుబాయ్‌లతో కొత్త భాగస్వామ్యంతో పాటు కస్టమర్‌లు దుబాయ్‌కి వెళ్లడాన్ని మరింత సులభతరం చేస్తుందన్నారు. అలాగే ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఆసియా అంతటా తమ భాగస్వాములు అందించే వంద గమ్యస్థానాలలో దేనికైనా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com