రమదాన్: ఇఫ్తార్ కోసం ఆహారాన్ని పంపిణీ చేయవచ్చా? Dh500,000 జరిమానా ఎందుకు?

- March 28, 2023 , by Maagulf
రమదాన్: ఇఫ్తార్ కోసం ఆహారాన్ని పంపిణీ చేయవచ్చా? Dh500,000 జరిమానా ఎందుకు?

యూఏఈ: పవిత్ర రమదాన్ మాసంలో మంచి పనులు చేసేందుకు యూఏఈలోని ఎమిరాటీలు, ప్రవాసులు పోటీ పడుతున్నారు. అయితే, యూఏఈలో ఉన్న విరాళాలను నియంత్రించే చట్టాలు, నియమాలు ఉన్న విషయాన్ని మర్చిపోవద్దని నిపుణులు చెబుతున్నారు.  కమ్యూనిటీ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ విరాళాలు సేకరించడంతోపాటు ఇతర ప్రక్రియలను నియంత్రించే చట్టాలను స్పష్టం చేసింది. విరాళాల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి జైలుశిక్ష లేదా Dh500,000 జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది. మంత్రిత్వ శాఖలోని సోషల్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ హెస్సా అబ్దుల్ రెహ్మాన్ తహ్లాక్ చట్టపరమైన మార్గాలను వివరించారు.

-లైసెన్స్ పొందిన స్వచ్ఛంద సంస్థలకు మాత్రమే ఆర్థిక విరాళాలు అందజేయాలి.

- మాల్స్ /బహిరంగ ప్రదేశాలలో అందుబాటులో ఉన్న పెట్టెల్లో విరాళం ఇవ్వాలి.

- పరిసరాల్లోని కుటుంబాలకు ఆహారాన్ని పంపిణీ, కొనుగోలు చేయవచ్చు.

- బాటసారులకు ఇఫ్తార్ భోజనాలు, ఖర్జూరాలను అందించవచ్చు.

- మస్జీదులలో నీటి సౌకర్యాలను ఏర్పాటు చేయవచ్చు.

- చట్టవిరుద్ధ ప్రయోజనాల కోసం విరాళాలు ఇవ్వడం నిషేధం.

వీటికి అనుమతి లేదు

నివాసితులు ఇఫ్తార్ భోజన పంపిణీకి రెస్టారెంట్లను అవుట్సోర్స్ చేయడానికి అనుమతించరు. దీనివల్ల దాతలు మోసం, దోపిడీకి గురవుతారు. అందువల్ల నిధుల సేకరణ పరిధిలోకి వచ్చే ఇలాంటి చర్యలను చట్టం నిషేధిస్తుందని అని తహ్లాక్ చెప్పారు. మార్కెట్‌లు, దుకాణాలు, కార్యాలయాల్లో సోషల్ మీడియా లేదా SMS సందేశాల ద్వారా లైసెన్స్ లేని నిధుల సేకరణ ప్రచారాలను అనుసరించవద్దని, నివాసితులు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. అధికారులచే లైసెన్స్ పొందిన , ఆమోదించబడిన స్వచ్ఛంద సంఘాలు, సంస్థల వివరాలు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ లో చూడవచ్చని  తహ్లాక్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com