వరంగల్ NIT మరో రికార్డ్.. క్యాంపస్ డ్రైవ్‌లో ఉద్యోగాల పంట
- March 28, 2023
వరంగల్ ఎన్ఐటీ విద్యార్థులు సత్తా చాటారు. 2022-23 సంవత్సరానికి గానూ క్యాంపస్ డ్రైవ్ లో ఉద్యోగాల పంట పండించారు. ఎప్పుడూ లేనంతగా అత్యధికంగా ప్లేస్ మెంట్ ఉద్యోగాలు సాధించారు.
క్యాంపస్ ఇంటర్వ్యూకి వచ్చిన 253 కంపెనీల్లో 1326 మంది ఉద్యోగాలు సాధించారు. అందులో 40 శాతానికి పైగా కొత్త కంపెనీలు ఉన్నాయి. ఢిల్లీకి చెందిన కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఆదిత్య సింగ్ రూ.88 లక్షల అన్యువల్ ప్యాకేజీతో ప్లేస్ మెంట్ లో అత్యధిక ప్యాకేజీ సాధించాడు.
30 మంది విద్యార్థులు రూ. 50 లక్షల అన్యువల్ ప్యాకేజీని దక్కించుకున్నారు. 55 మంది రూ.40 లక్షల ప్యాకేజీ, 190 మంది రూ.30 లక్షల ప్యాకేజీని దక్కించుకున్నారు. 408 మంది స్టూడెంట్ రూ.20 లక్షల ప్యాకేజీ పొందారు. 50 మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు సాధించారు. అయితే, పోయిన ఏడాది క్యాంపస్ ప్లేస్ మెంట్ నియామకాల్లో 1132 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. నిట్ సంస్థలో విద్యా ప్రమాణాలు, నాణ్యత పెరగడంవల్లే ఈ ఏడాది ఇంతమందికి క్యాంపస్ ప్లేస్ మెంట్స్ దక్కాయని నిట్ అధికారి ఎన్.వి.రమణారావు అన్నారు.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







