ఇజ్రాయెల్, జర్మనీలకు నిలిచిన విమాన సర్వీసులు!
- March 28, 2023
యూఏఈ: ఇజ్రాయెల్, జర్మనీ దేశాల్లో నిరసనలు, సమ్మెల కారణంగా సోమవారం యూఏఈ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలకు అంతరాయం ఏర్పడింది. యూఏఈ నుండి బయలుదేరిన కొన్ని ఇజ్రాయెల్-బౌండ్ ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానాలు తిరిగి రావాల్సి వచ్చింది. టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సమ్మె కారణంగా ఫ్లైదుబాయ్ విమానాలు కూడా ఆలస్యంగా నడిచాయి. “టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మార్చి 27న అబుధాబి నుండి టెల్ అవీవ్‌కు వెళ్లిన ఎతిహాద్ విమానం EY593 తిరిగి అబుధాబికి చేరుకుంది.” అని ఎతిహాద్ ఎయిర్‌వేస్ ప్రతినిధి తెలిపారు. అదే సమయంలో టెల్ అవీవ్ నుండి దుబాయ్, యూఏఈలకు రావాల్సిన పలు విమానాలు రద్దు అయినట్లు పేర్కొన్నారు. జర్మనీకి చెందిన రెండు అతిపెద్ద యూనియన్‌లు కూడా సమ్మెకు దిగడంతో పలు విమాన సర్వీసులు రద్దు కావడంతోపాటు పలు సర్వీసులను రీషెడ్యూల్ చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ముఖ్యంగా మ్యూనిచ్, ఫ్రాంక్‌ఫర్ట్, డ్యూసెల్‌డార్ఫ్‌లకు దుబాయ్ ఆధారిత ఎయిర్‌లైన్స్ విమానాలు అధిక సంఖ్యలో రద్దు అయినట్లు పేర్కొన్నారు. కాగా, యూరోపియన్ దేశంలో జాతీయ పారిశ్రామిక సమ్మె కారణంగా ఆదివారం కూడా పలు విమాన సర్వీసులు ప్రభావితమైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్‌వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







