హైదరాబాద్ లో 40 డిగ్రీలకు చేరుకోనున్న ఉష్ణోగ్రతలు..
- March 28, 2023
హైదరాబాద్: ఇటీవల కురిసిన వడగండ్ల వానను హైదరాబాద్ వాసులు ఫుల్ ఎంజాయ్ చేశారు. తాజాగా ఎండాకాలం ప్రతాపం చూపుతోంది. చల్లటి వాతావరణం కాస్తా మండుటెండగా మారుతోంది. రాబోయే రోజుల్లో ఎండ దంచి కొడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వారంలోనే హైదరాబాద్ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
ఈ క్రమంలో ఒకటి, రెండు రోజుల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను తాకే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, కొమరం భీమ్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎండలు జనాలకు ముచ్చెమటలు పట్టిస్తాయని పేర్కొంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలను పాటించాలని సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







