ఆ పత్రాలను ధ్వంసం చేస్తే.. Dh1 మిలియన్ జరిమానా, జైలు శిక్ష
- March 28, 2023
యూఏఈ: పబ్లిక్, చారిత్రాత్మక, జాతీయ, ప్రైవేట్ పత్రాలను ఉద్దేశపూర్వకంగా నాశనం చేసిన సందర్భాల్లో విధించే జరిమానా, జైలుశిక్ష గురించిన వివరాలను యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (PP) వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం తన సోషల్ మీడియా ఖాతాలలో ఒక పోస్ట్ పెట్టింది. నేషనల్ లైబ్రరీ, ఆర్కైవ్స్ సవరణలపై 2008 ఫెడరల్ లా నెం. (7)లోని ఆర్టికల్ నెం.25 ప్రకారం.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఒక పత్రాన్ని నాశనం చేస్తే.. వారికి నిర్బంధ శిక్ష విధించబడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఎనిమిది నెలల జరిమానాతోపాటు Dh40,000 - Dh100,000 మధ్య జరిమానా లేదా ఈ రెండింటిని విధించే అవకాశం ఉందని వివరించింది. కీలక పత్రాలను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా విధ్వంసం చేసినా, స్మగ్లింగ్ చేసినా, కాపీలు చేసినా లేదా బహిర్గతం చేసినా కనీసం ఒక సంవత్సరం పాటు జైలుశిక్ష లేదా Dh50,000 - Dh 1,000,000 వరకు జరిమానా విధించబడుతుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా







