అంబులెన్స్‌లకు దారి ఇవ్వకుంటే కేసులే..!

- March 28, 2023 , by Maagulf
అంబులెన్స్‌లకు దారి ఇవ్వకుంటే కేసులే..!

రియాద్ :  అంబులెన్స్‌లకు దారి ఇవ్వకుండా వాటి కదలికకు ఆటంకం కలిగించడానికి  యత్నించిన వారిపై ఉల్లంఘనల నమోదుకు ఆటోమేటిక్ మానిటరింగ్, రికార్డ్ చేయడానికి యాప్‌ను ప్రారంభించినట్లు సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ ప్రకటించింది. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ సహకారంతో ఈ యాప్ ను రూపొందించినట్లు తెలిపింది. యాప్ ద్వారా పర్యవేక్షణ మార్చి 26  నుండి అమల్లోకి వచ్చిందని పేర్కొంది. అంబులెన్స్‌లు వాటి గమ్యస్థానాలకు వెళ్లే మార్గాన్ని అనుసరించే వాహనదారులు ఇతర ఉల్లంఘనలను కూడా యాప్ ద్వారా నమోదు అవుతాయని తెలిపింది. యాప్‌ను ప్రారంభించడం ద్వారా బాధితుల ప్రాణాలను కాపాడడం, ట్రాఫిక్ భద్రతను మెరుగుపరచడం, నిర్దిష్ట లేన్‌లకు డ్రైవర్లు కట్టుబడి ఉండేలా చేస్తుందన్నారు. ఇది అంబులెన్స్ సేవల నాణ్యత, సామర్థ్యాన్ని పెంచడానికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. "మేక్ ది వే ఫర్" అనే నినాదంతో ఫిబ్రవరి ప్రారంభంలో ఒక అవగాహన ప్రచారాన్ని అమలు చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ను తయారీని ప్రారంభించినట్లు అథారిటీ వెల్లడించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com