ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!
- March 28, 2023
యూఏఈ: స్టార్‌గేజర్‌లుగా అభివర్ణించే ఐదు గ్రహాల అమరిక.. మార్చి 28న రాత్రి యూఏఈ ఆకాశంలో కనువించు చేయనుంది. బుధుడు, బృహస్పతి, శుక్రుడు, యురేనస్, మార్స్ సూర్యాస్తమయం ఓకే వరుసలో ఆకాశంలో చంద్రుడితో పాటు ఆర్క్ రూపంలో కనిపిస్తుంది. కానీ, పరిసర కాంతి పరిస్థితిపై ఆధారపడి ఈ గ్రహాల అమరికను ప్రభావవంతంగా చూడగలరని నిపుణులు చెప్పారు. అయితే, యూఏఈలో ఈ గ్రహాల అమరిక దృశ్యాన్ని ప్రజలు ఆస్వాదించవచ్చని దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ సీఈఓ హసన్ అల్ హరిరి తెలిపారు. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఇది జరుగుతుందని, గత సంవత్సరం ఇలాంటి అరుదైన గ్రహాల అమరిక ఉదయం జరిగిందని గుర్తుచేశారు. సాధారణంగా గ్రహాలు వేర్వేరు కక్ష్యలు.. కక్ష్య కాలాల్లో సూర్యుని చుట్టూ తిరుగుతాయని, కొన్నిసార్లు అవి ఒక అమరికలో ఆకాశంలో కనిపిస్తాయని పేర్కొన్నారు. అయితే, బైనాక్యులర్‌లను ఉపయోగించడం వల్ల గ్రహాలను స్పష్టంగా చూడవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







