‘వాణిజ్య మిగులు’లో జర్మనీని దాటేసిన ఖతార్..!

- March 28, 2023 , by Maagulf
‘వాణిజ్య మిగులు’లో జర్మనీని దాటేసిన ఖతార్..!

దోహా: ఖతార్ $97.5 బిలియన్ల వాణిజ్య మిగులు(ట్రేడ్ సర్ ప్లస్)ను నమోదు చేసింది. 2022లో అత్యధిక వాణిజ్య మిగులును నమోదు చేసిన దేశాలలో 2021 నుండి ఐదు స్థానాలు ఎగబాకి ఆరవ స్థానంలో నిలిచింది. రష్యన్ RIA నోవోస్టి వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. ఖతార్ జర్మనీ కంటే ముందు స్థానంలో ఉంది. జర్మనీ $85.34 బిలియన్ల మిగులుతో ప్రపంచవ్యాప్తంగా ఏడవ స్థానానికి పడిపోయింది. ఇది 2021 ఫలితాల కంటే 2.5 రెట్లు తక్కువ కావడం గమనార్హం. కాగా, ఇదే జాబితాలో చైనా, రష్యాలు వాణిజ్య మిగులులో ప్రపంచ అగ్రగామి దేశాలుగా నిలిచాయి. RIA నోవోస్టి నివేదిక ప్రకారం.. 2022లో చైనా $877.6 బిలియన్ వాణిజ్య మిగులు ప్రపంచంలో తొలిస్థానంలో ఉంది. గతేడాదితో పోల్చితే 30% పెరగడం విశేషం. ఇక రెండో స్థానంలోఉన్న రష్యా వాణిజ్య మిగులు 1.7 రెట్లు పెరిగి.. $333.4 బిలియన్లకు చేరుకుంది. ఈ జాబితాలో నార్వే, ఆస్ట్రేలియాలను దాటి సౌదీ అరేబియా మూడవ స్థానానికి చేరుకోవడం గమనార్హం. జనవరి నుండి డిసెంబర్ వరకు ప్రపంచంలోని 60 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాతీయ గణాంక సేవల డేటా ఆధారంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.  ఖతార్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ అథారిటీ (PSA) ప్రకారం.. 2021లో QR 215.25 బిలియన్లతో పోలిస్తే 2022లో ఖతార్ వాణిజ్య బ్యాలెన్స్ మిగులు QR 354.85 బిలియన్లను నమోదు చేసింది. ఖతార్ ట్రేడ్ బ్యాలెన్స్ పనితీరు 50.2% పెరిగి 476.71 బిలియన్లకు చేరింది. 2021లో ఇది QR 317.42 బిలియన్లుగా ఉంది. అదే సమయంలో ఖతార్ దిగుమతులు 19.3% పెరిగి 2022లో QR 121.86 బిలియన్లకు చేరాయి. 2021లో దిగుమతుల QR 102.17 బిలియన్లుగా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com