ప్రధాని మోదీకి ఆస్కార్ అందించిన విజేతలు..
- March 30, 2023
న్యూ ఢిల్లీ: ఈ ఏడాది జరిగిన ఆస్కార్ వేడుకల్లో ఇండియన్ సినిమాలు సత్తా చాటాయి. రెండు చిత్రాలు ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించాయి. 95వ ఆస్కార్ వేడుకలకు ఇండియా నుంచి మూడు చిత్రాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. All That Breathes, The Elephant Whisperers, RRR చిత్రాలు ఫైనల్ నామినేషన్స్ నిలిచాయి. వీటిలో ది ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్రం బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో, ఆర్ఆర్ఆర్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అందుకొని విజేతలుగా నిలిచాయి. ఇప్పటి వరకు పలు ఇండియన్స్ కి ఆస్కార్ వచ్చినా అవేవి భారతీయ సినిమాలకు గాను వరించలేదు.
ఇండియన్ సినిమాకి ఆస్కార్ అందుకున్నది ఈ రెండు సినిమాలు మాత్రమే. దీంతో దేశంలోని ప్రతి ఒక్కరు ఈ రెండు టీమ్స్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ కూడా ట్విట్టర్ వేదికగా అభినందించారు. తాజాగా ది ఎలిఫెంట్ విష్పరర్స్ టీం ప్రధాని మోదీని కలుసుకొని అయన చేతికి ఆస్కార్ ని అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మోదీ ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ది ఎలిఫెంట్ విష్పరర్స్ తో ఆస్కార్ ని అందుకొని ప్రపంచ దృష్టిని, ప్రశంసలను పొందిన డైరెక్టర్ కార్తికి గోన్సాల్వేస్, నిర్మాత గునీత్ మోంగా ని కలిసే అవకాశం నాకు లభించింది. వీరిరుద్దరు భారతదేశం గర్వించేలా చేశారు” అంటూ ట్వీట్ చేశారు.
ఇటీవల తమిళనాడు సీఎం MK స్టాలిన్ ని కూడా కలిసి ఆయనకి ఆస్కార్ ని అందించారు. కాగా సీఎం స్టాలిన్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’లో కనిపించిన ఎలిఫెంట్ కేర్ టేకర్ బొమ్మన్ అండ్ బెల్లి దంపతులకు 2 లక్షల బహుమతి అందజేయడమే కాకుండా, వారిలా ఎలిఫెంట్ కేర్ క్యాంపు లో వర్క్ చేసే 91 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 1 లక్ష ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అంతేకాదు ఆ వర్కర్స్ కోసం యకో ఫ్రెండ్లీ హోమ్స్ నిర్మించేందుకు రూ.9.1 కోట్లు మంజూరు చేశారు. అలాగే యనమలై టైగర్ రిజర్వ్ ఏరియాలో, కోయంబత్తూరు చావడిలో కొత్త ఎలిఫెంట్ క్యాంపులు నిర్మించేందుకు 5, 8 కోట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!
- కువైట్ లోని నేచర్ రిజర్వ్ లో వేట..ఇద్దరు అరెస్టు..!!
- దోహా ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ పై స్టేట్ కౌన్సిల్ సమీక్ష..!!
- బహ్రెయిన్ లో విదేశీ సిబ్బందికి వర్క్ వీసాల జారీ కఠినం..!!
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..







