ఛత్రపతి హిందీ టీజర్ రిలీజ్
- March 30, 2023
హైదరాబాద్: తెలుగు లో ప్రభాస్ – రాజమౌళి కలయికలో వచ్చిన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో బెల్లకొండ శ్రీనివాస్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ హిందీలో డైరెక్ట్ చేస్తున్నాడు. గత కొద్దీ నెలలుగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్నా ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ రీసెంట్ గా విడుదలై ఆకట్టుకోగా..ఈరోజు శ్రీరామ నవమి సందర్బంగా హిందీ టీజర్ ను రిలీజ్ చేసి అలరించారు .భారీ మాస్ యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన టీజర్ బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా నచ్చేస్తుంది.
18 ఏళ్ల కిందట టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతుండడం..ఈ సినిమా తో బెల్లకొండ శ్రీనివాస్ హిందీ లో అడుగుపెడుతుండడం తో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. వేసవి కానుకగా మే 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాను పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతి లాల్ నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమా శ్రీనివాస్ కు ఎంత మేర కలిసొస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







