జహ్రాలో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ క్యాంప్

- March 31, 2023 , by Maagulf
జహ్రాలో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ క్యాంప్

కువైట్: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం మార్చి 31వ తేదీన జహ్రాలో కాన్సులర్ క్యాంపును నిర్వహించనుంది. ఇది వాహా ఏరియాలోని డోడీ కిడ్స్ నర్సరీ స్కూల్‌లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు జరుగుతుందని కువైట్‌లోని భారత రాయబారి హెచ్‌ఇ డాక్టర్ ఆదర్శ్ స్వైకా తెలిపారు. పాస్‌పోర్ట్ రెన్యూవల్, రిలేషన్‌షిప్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌ట్రాక్ట్, జనరల్ పీఓఏ, సిగ్నేచర్ అటెస్టేషన్, ఇతర సాధారణ ధృవీకరణ సేవలు వంటి అన్ని సేవలు ఈ క్యాంపులో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com