319 మంది ఖైదీలు విడుదల
- March 31, 2023
మస్కట్: రమదాన్ మొదటి వారంలో ఒమన్ సుల్తానేట్లో ‘ఫక్ కుర్బా’ చొరవలో భాగంగా 319 మంది ఖైదీలను విడుదల చేశారు. నార్త్ అల్ బతినా గవర్నరేట్ నుండి 98 మంది ఖైదీలు, అల్ దహిరా గవర్నరేట్ నుండి 54 మంది, అల్ బురైమి గవర్నరేట్ నుండి 42 మంది ఖైదీలు విడుదలైన వారిలో ఉన్నారు. అలాగే సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ నుండి 32, మస్కట్ గవర్నరేట్ నుండి 29, అల్ దఖిలియా గవర్నరేట్ నుండి 20 మంది దివాలా తీసిన కేసులలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు విడుదలయ్యారు. దక్షిణ అల్ బతినా గవర్నరేట్ 26, నార్త్ అల్ షర్కియా గవర్నరేట్ నుండి 13, ధోఫర్ గవర్నరేట్ నుండి 4, ముసందమ్ గవర్నరేట్ నుండి ఒకరు విడుదలయ్యారు. మొత్తంగా ఫక్ కుర్బా పదవ ఎడిషన్లో 1,300 మంది ఖైదీలను విడుదల చేయాలని ఒమన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







