స్వచంద పదవీ విరమణ పొందిన ఖదీర్ ను సన్మానించిన సీపీ చౌహాన్
- March 31, 2023
హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషరేట్ లోని కీసర పోలీస్ స్టేషన్ నందు హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎండీ. ఖదీర్ ఈ రోజు స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. LB Nagar లోని సిపి క్యాంప్ ఆఫీస్ లో రాచకొండ కమిషనర్ డి.ఎస్.చౌహాన్ ఖదీర్ ను సన్మానించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... ఉద్యోగ నిర్వహణలో సుధీర్ఘ కాలంగా అంకిత భావంతో పనిచేసి పదవీ విరమణ చేస్తున్న ఖదీర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని సూచించారు.రిటైర్ మెంట్ డబ్బును భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని డబ్బులను ఆచితూచి ఖర్చు చేయాలన్నారు.ఈ సందర్భంగా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బెనిఫిట్ ఫండ్ క్రింద 30,000/- రూ మరియు సొసైటీ పొదుపు మొత్తాన్ని 1,12,964/- రూ చేకులను సీపీ ఖదీర్ కు అందచేశారు.
ఈ కార్యక్రమంలో సీపీతో పాటు డీసీపీ అడ్మిన్ పి.ఇందిర, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు సి.హెచ్ భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి, రవుఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







