IGNOU లో ఉద్యోగాలు
- March 31, 2023
న్యూ ఢిల్లీ: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిషికేషన్ ద్వారా మొత్తం 200 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో జూనియర్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఇటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి నిమిషానికి 40 పదాల వేగంతో ఇంగ్లీష్ టైపింగ్ , నిమిషానికి 35 పదాల వేగంతో హిందీ టైపింగ్ వచ్చి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
మొత్తం పోస్టుల్లో 83 పోస్టులు అన్రిజర్వ్డ్, 29 ఎస్సీ, 12 ఎస్టీ, 55 ఓబీసీ, 21 ఈడబ్ల్యూఎస్ పోస్టులు కేటాయించారు. అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ 200 పోస్టుల్లో ఈ రిక్రూట్మెంట్ కోసం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో మినహాయింపు వర్తిస్తుంది.
అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించబడుతుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.19 వేల 900 నుంచి రూ.63 వేల 200 వరకు వేతనం చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://recruitment.nta.nic.inని పరిశీలించగలరు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







