సల్మాన్ ఖాన్ సినిమాలో ‘బతుకమ్మ’ పాట.! అందుకోసమేనా.?
- March 31, 2023ఇప్పుడు భాషతో సంబంధం లేదు సినిమాలకి. ప్యాన్ ఇండియా అనే ట్యాగ్ మాత్రమే. ప్యాన్ ఇండియా ఫ్లేవర్ కోసం అన్ని రకాల భాషల నటీనటులు కలిసి స్ర్కీన్ షేర్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే బాలీవుడ్ నటీనటలు సౌత్ సినిమాల్లో నటిస్తున్నారు. సౌత్ యాక్టర్స్ నార్త్‌లోనూ నటిస్తున్నారు.
తాజాగా విక్టరీ వెంకటేష్ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న బాలీవుడ్ మూవీ ‘కిసీ కి భాయ్ కిసీ కి జాన్’ సినిమాలో తెలుగు పాటను అదీ తెలంగాణా ట్రెడిషనల్ సాంగ్ అయిన ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’ పాటను పెట్టడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
తాజాగా ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సాంగ్‌లో పూజా హెగ్దే, వెంకటేష్, సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్దే క్యూట్ క్యూట్ స్టెప్పులేస్తుండగా, వెంకటేష్, సల్మాన్ ఖాన్ పంచె కట్టుల్లో ట్రెడిషనల్‌గా కనిపిస్తున్నారు.
ఈద్ సందర్భంగా ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత