వాహనాలను ఢీకొట్టి.. గాలిలోకి కాల్పులు జరిపిన డ్రైవర్‌ అరెస్ట్

- April 01, 2023 , by Maagulf
వాహనాలను ఢీకొట్టి.. గాలిలోకి కాల్పులు జరిపిన డ్రైవర్‌ అరెస్ట్

రియాద్ : ఉద్దేశపూర్వకంగా అనేక వాహనాలను తన కారుతో ఢీకొట్టి,  అనంతరం గాలిలో కాల్పులు జరిపి తప్పించుకోవడానికి ప్రయత్నించిన సౌదీ వ్యక్తిని అరెస్టు చేసినట్లు రియాద్ పోలీసులు వెల్లడించారు. దక్షిణ రియాద్‌లోని అనేక కార్ షోరూమ్‌లు ఉన్న వీధిలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడగా.. ఏడు వాహనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. కారు డ్రైవర్, అతని సహచరుడి వికృత చర్యల గురించి సోషల్ మీడియాలో వైరలయిన వీడియో తమ దృష్టికి రావడంతో భద్రతా పెట్రోలింగ్ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయని రియాద్ పోలీసు ప్రతినిధి తెలిపారు. అసాధారణ స్థితిలో ఉన్న వ్యక్తిని గస్తీ బృందాలు అదుపులోకి తీసుకున్నాయని, ఆ వ్యక్తిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశామని, అతని సహచరుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com