రస్‌ అల్‌ ఖైమాలో స్పీడ్‌ హంప్స్‌

- May 07, 2016 , by Maagulf
రస్‌ అల్‌ ఖైమాలో స్పీడ్‌ హంప్స్‌

రోడ్లపై రయ్యిన దూసుకుపోయే వాహనాలతో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నా కొన్ని ప్రాంతాల్లో ప్రమాదాల సంఖ్య తగ్గడంలేదు. ఈ కారణంగా కొన్ని చోట్ల స్పీడ్‌ హంప్స్‌ని ఏర్పాటు చేయాలని రస్‌ అల్‌ ఖైమా పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్‌ ఇంజనీరింగ్‌ - ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్స్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ కల్నల్‌ అహ్మద్‌ సయీద్‌ అల్‌ సామ్‌ అల్‌ నక్‌బి మాట్లాడుతూ, కోర్నిచ్‌ అల్‌ కవాయిసమ్‌ రోడ్‌ మరియు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ సలీమ్‌ రోడ్‌ డౌన్‌ టౌన్‌లో కొత్తగా స్పీడ్‌ హంప్స్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రోడ్‌ హంప్స్‌ ఏర్పాటు చేసినా కొందరు వాహనదారులు మితిమీరిన వేగంతో వెళుతున్నారనీ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన బాధ్యత వాహనదారులపైన కూడా ఉందని అధికారులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com