సేద తీరిన జంటనగరాలు

- May 07, 2016 , by Maagulf
సేద తీరిన జంటనగరాలు

హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్, బంజారా హిల్స్, జూబ్లిహిల్స్‌ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. శంషాబాద్ మండలంలో శనివారం సాయంత్రం పలుచోట్ల వడగళ్లు కూడా పడ్డాయి. గంటన్నర పాటు కురిసిన వానతో జీనజీవనం స్థంభించిపోయింది. రహదారులంతా జలమయంగా మారాయి.వర్షం ధాటికి శంషాబాద్ మండల కేంద్రంలోని మినిస్టేడియం చెరువులా మారింది. డ్రైయినేజీలు పొంగిపొర్లడంతో రాకపోకలు సాగించలేని విధంగా మారిపోయింది. పలుచోట్ల హోర్డింగులు, ఫ్లెక్సీలు పూర్తిగా ఊడిపోయాయి. గాలిదుమారం కారణంగా విద్యుత్ సరఫరాను కూడా రెండుగంటల పాటు నిలిపివేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com