ప్రవాస కార్మికుల్లో 25% మంది గృహ సహాయకులే
- April 02, 2023
కువైట్: సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో (CSB) జారీ చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2022 చివరి నాటికి కువైట్‌లోని మొత్తం కార్మిక శక్తిలో గృహ కార్మికులు దాదాపు 27 శాతం ఉన్నారు. 2021 చివరి నాటికి మొత్తం కార్మిక శక్తిలో మొత్తం గృహ కార్మికులు 24 శాతం మాత్రమే ఉన్నారు. 2022 చివరి నాటికి మొత్తం ప్రవాస గృహ కార్మికులు 753,000 కాగా... 2021 నాటికి 594,000 మంది కార్మికులు ఉన్నారు. ఈ గృహ కార్మికులలో 347,000 మంది పురుషులు, 406,000 మంది మహిళలు ఉన్నారు. ఇక భారతీయ పురుష కార్మికులు 239,000 మంది(2021 లో 196,000)తో తొలిస్థానంలో ఉంది. ఇక ఆ తర్వాతి స్థానంలో ఫిలిపినో కార్మికులు 199,000 (2021 - 135,000 ) ఉన్నారు. మొత్తం గృహ కార్మికులలో భారతీయులు(పురుషులు,మహిళలు) 44.8 శాతంతో మొదటిస్థానంలో ఉండగా.. ఫిలిప్పీన్స్ 26.6 శాతంతో రెండవ స్థానంలో ఉంది. భారతదేశం, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక అనే నాలుగు జాతీయులు మొత్తం గృహ కార్మికులలో 94.9 శాతం వాటాను కలిగిఉన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!







