రేషన్ కార్డులు, ఓటర్ లిస్ట్ ల నుండి గల్ఫ్ కార్మికుల పేర్లు తొలగించొద్దు
- April 03, 2023
హైదరాబాద్: గల్ఫ్ వలస కార్మికుల డిమాండ్లతో కూడిన అవగాహన పోస్టర్ ను మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ బిజెపి నాయకులు నారపరాజు రాంచందర్ రావు ఆదివారం (02.04.2023) హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు. తెలంగాణ బిజెపి ఎన్నారై సెల్ గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు ఈ పోస్టర్ ను రూపొందించారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర పన్నీరుతో పాటు బిజెపి తెలంగాణ ఎన్నారై సెల్ కోఆర్డినేషన్ కమీటీ చైర్మన్ తోపాలి శ్రీనివాస్,ఎన్నారై సెల్ సబ్యులు గంగాధర అంజి పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల నుండి, ఓటర్ లిస్ట్ నుండి గల్ఫ్ కు వెళ్లిన కార్మికుల పేర్లు తొలగించవద్దని ఈ సందర్భంగా
నరేంద్ర పన్నీరు కోరారు. అన్ని విద్యా సంస్థలలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా. రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్ వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్ లో గల్ఫ్ దేశాల రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. ప్రవాసి బీమాలో సహజ మరణాన్ని చేర్చాలని నరేంద్ర కోరారు.
ఇబ్బందుల్లో ఉన్న గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సహాయం కోసం, సలహా కోసం న్యూ ఢిల్లీ లోని ప్రవాసి భారతీయ సహాయత కేంద్రం నెంబర్లు +91 11 4050 3090 & +91 11 2688 5021 కు కాల్ చేయాలని ఆయన సూచించారు. ఇండియాలో ఉన్నవారు టోల్ ఫ్రీ నెంబర్ 1800 11 3090 హైదరాబాద్ లోని క్షేత్రీయ ప్రవాసి సహాయత కేంద్రం నెంబర్: +91 40 2777 2557 లకు కాల్ చేయవచ్చు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







