ఉమ్రా యాత్రికులు నగదు, నగలు తేవద్దు: సౌదీ
- April 03, 2023
సౌదీ: ఉమ్రాకు వచ్చే యాత్రికులు పెద్ద మొత్తంలో నగదు, ఖరీదైన వస్తువులు, ఆభరణాలను తీసుకురావద్దని సౌదీ అరేబియా హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ సూచించింది. యాత్రికులు ఆర్థిక మోసాలకు గురికాకుండా మంత్రిత్వ శాఖ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణికులు గరిష్ఠంగా $16,000 (SAR 60,000) నగదును మాత్రమే వెంట తీసుకురావాలని అధికార యంత్రాంగం సూచించింది. కరెన్సీని బదిలీ చేయడానికి లేదా మార్పిడి చేయడానికి అధీకృత బ్యాంకులు, మనీ ఎక్స్ఛేంజ్ ప్రొవైడర్లను మాత్రమే ఉపయోగించాలని సూచించింది. ఆర్థిక లావాదేవీలను పూర్తి చేయడానికి సౌదీ అరేబియాలో మూడు రకాలు మాస్టర్ కార్డ్, వీసా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్‌లు ఆమోదయోగ్యమైనవని పేర్కొంది. తమ రక్షణ హక్కుల కోసం ఆర్థిక లావాదేవీలు జరిపిన సమయంలో యాత్రికులు అన్ని రసీదులు, ఎలక్ట్రానిక్ లావాదేవీల రుజువులను తమ వద్ద పెట్టుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!
- కువైట్ లోని నేచర్ రిజర్వ్ లో వేట..ఇద్దరు అరెస్టు..!!
- దోహా ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ పై స్టేట్ కౌన్సిల్ సమీక్ష..!!
- బహ్రెయిన్ లో విదేశీ సిబ్బందికి వర్క్ వీసాల జారీ కఠినం..!!
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..







