బెంగళూరు బీహెచ్ఈఎల్ లో ఉద్యోగాలు...
- April 04, 2023
బెంగుళూరు: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బెంగళూరులో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన ద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 60 శాతం కనీస మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏడాది పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 32 ఏళ్లలోపు ఉండాలి.
అభ్యర్ధుల ఎంపికకకు సంబంధించి పర్సనల్ ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ఉంటుంది. జీతభత్యాలుగా నెలకు 43,550 చెల్లిస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులు పంపేందుకు చివరి తేది 29 ఏప్రిల్ 2023గా నిర్ణయించారు. ఆఫ్ లైన్ దరఖాస్తులకు మే 6, 2023 తుదిగడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.bhel.com/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







