సమంత పై ఎందుకింత పగ.!

- April 05, 2023 , by Maagulf
సమంత పై ఎందుకింత పగ.!

‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్ల పేరు చెప్పి సమంత మళ్లీ యాక్టివ్ అయ్యింది. ఈ నేపథ్యంలో మీడియాతో వరుసగా ఇంటరాక్ట్ అవుతోంది. అయితే, మాసిపోయిన గాయాన్ని పదే పదే గుచ్చి గుచ్చి బాధిస్తున్నారని సమంత వాపోతోంది.
చైతో విడాకులు తీసుకున్నాక సమంత చాలా చాలా ఇబ్బందులు పడింది. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని కెరీర్‌లో నిలబడింది. సంపాదించుకున్న స్టార్‌డమ్‌ని కాపాడుకుంటూ వస్తోంది సమంత. 
మాయదారి రోగం ‘మయోసైటిస్’ బారిన పడి, దాదాపు చావు అంచుల్ని చూసొచ్చింది. ఇంకేముంది కెరీర్ అయిపోయిందనుకున్నారంతా. కానీ, సినిమాపై తనకున్న ప్రేమతో మళ్ల తనను తాను సిద్ధం చేసుకుంది. తనపై నమ్మకం పెట్టుకున్న నిర్మాతల్ని ఇబ్బందిలోకి నెట్టకూడదన్న ఉద్దేశ్యంతో కమిట్ అయిన ప్రాజెక్టుల్ని కంప్లీట్ చేసే పనిలో బిజీగా వుంది. 
అయితే, సమంతపై జరుగుతున్న ట్రోలింగ్, వస్తున్న అసత్యపు కథనాలు ఆమెని మరింతగా బాధిస్తున్నాయంటోంది సమంత. తాను అనని మాటల్ని సైతం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారనీ అసహనం వ్యక్తం చేస్తోంది. నాకే ఎందుకిలా.? అని బాధపడుతోంది. పాపం కదా సమంత.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com