ఇక భారత్ మొత్తానికి ఒకటే ఎమర్జెన్సీ నెంబర్
- May 08, 2016
దేశమంతటికీ ఒకటే ఎమర్జెన్సీ నంబర్ వచ్చే జనవరి నుంచి అమల్లోకి రానుంది. అత్యవసర సేవలైన పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక శాఖల సేవలను 2017 జనవరి ఒకటి నుంచి ఒకే నంబరుతో అందుబాటులోకి తేనున్నారు. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నవారైనా సరే '112' నంబరు డయల్ చేస్తే చాలు.
అమెరికాలో అమల్లో ఉన్న 911 లాగా మనదేశంలోనూ ఒకటే ఎమర్జెన్సీ నంబరును అమల్లోకి తీసుకురావడానికి టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆమోద ముద్ర వేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ మనదేశంలో వేర్వేరు విభాగాలకు వేర్వేరు ఎమర్జెన్సీ నంబర్లు ఉన్న సంగతి తెలిసిందే. పోలీస్ శాఖకి 100, అగ్నిమాపక శాఖ 101, అంబులెన్స్ 102, విపత్తు నిర్వహణ శాఖ 108.. ఇలా పలు నంబర్లున్నాయి. వీటిన్నిటి బదులు ఒకే నంబరు తేవడానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతోంది.
వేర్వేరు కారణాల వల్ల అవుట్ గోయింగ్ కాల్స్ సౌకర్యం తాత్కాలికంగా నిలిపివేసిన సిమ్స్, ల్యాండ్‌లైన్ ఫోన్లనుంచి కూడా ఈ అత్యవసర నంబరుకు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది. అవసరంలో ఉన్న వారు ఎవరైనా సరే 112 నంబరుకు ఫోన్ చేస్తే చాలు, సంబంధిత విభాగానికి ఆ కాల్ వెళ్లిపోతుంది. 112 అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు వివిధ విభాగాలకు విడివిడిగా ఉన్న ఎమర్జెన్సీ నంబర్లను దశలవారీగా తొలగిస్తారు. ఎమర్జెన్సీ కాల్స్‌ని 112కి మళ్లించవలసిందిగా టెలికాం ఆపరేటర్లకు సూచించారని, ప్రస్తుతం ఆ ప్రక్రియపై పని జరుగుతోందని అధికారులు తెలిపారు. వివిధ భాషలు మాట్లాడగలిగే సిబ్బందితో ఓ కాల్‌సెంటర్ తరహా సౌకర్యం ఏర్పాటు చేసి ఈ సింగిల్ ఎమర్జెన్సీ నంబర్‌ను అందుబాటులోకి తేనున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- ఏపీ నూతన సీఎస్‌గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు..
- సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం
- రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!
- నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!
- శ్రీనగర్‌లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్‌గా అహ్మద్ వాహిదీ
- ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్









