టర్కీ దళాల చేతిలో 55 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతం
- May 08, 2016
టర్కీ దళాలు సిరియాలోని అలెప్పొ ప్రావిన్స్‌లో జరిపిన దాడుల్లో దాదాపు 55 మంది ఐఎస్ ఉగ్రవాదులు మృతి చెందారు. టర్కీ దళాలు ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించాయి. టర్కీ దళాలు శనివారం మూడు వాహనాలతోపాటు మూడు రాకెట్ ఇన్స్టాలేషన్లను కూడా ధ్వంసం చేశాయని జిన్‌హుయా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఉత్తర సిరియాలో సంకీర్ణ దళాలు వేర్వేరుగా జరిపిన దాడుల్లో దాదాపు 48 మంది ఐఎస్ ఉగ్రవాదులు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు టర్కీ దళాలు 2,144 ఐఎస్ స్థావరాలను ధ్వంసం చేసి దాదాపు 807 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లైంది. ఇది అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు జరిపే దాడుల్లో భాగమని టర్కీ ప్రకటించింది.
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రయాణం ప్రారంభించిన స్పోర్ట్స్ హ్యాకథాన్ టార్చ్
- కీలక మ్యాచ్‌లో విండీస్‌పై భారత్ ఘన విజయం..
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ









