అనుపమ పరమేశ్వరన్ నయా యాంగిల్ చూశారా.?

- April 12, 2023 , by Maagulf
అనుపమ పరమేశ్వరన్ నయా యాంగిల్ చూశారా.?

సినిమాటోగ్రఫర్‌గా మారిందట. ఓ షార్ట్ ఫిలింని రూపొందించిందట. మొదట్నుంచీ అనుపమ విషయమున్న నటి. నటిగా తనదైన ప్రత్యేకతను చాటుకోవడమే కాదు, సినిమాపై మంచి పట్టు సాధించింది.

కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా, 24 క్రాప్ట్స్‌‌లో టెక్నికల్‌గా తనకు సాధ్యపడినంత అనుభవాన్ని కూడా రంగరించుకుందని తాజా విషయం ద్వారా ప్రూవ్ అవుతోంది. 
అందులో భాగంగానే అనుపమా పరమేశ్వరన్ సినిమాటోగ్రఫర్ అవతారమెత్తిందనీ తెలుస్తోంది. ‘ఐ మిస్ యు’ అను షార్ట్ ఫిలింకి సినిమాటోగ్రఫర్‌గా వర్క్ చేయడమే కాదండోయ్ ప్రొడక్షన్ బాధ్యతలు కూడా నిర్వహించింది అనుపమ.

యూ ట్యూబ్‌లో ఈ షార్ట్ ఫిలిం అందుబాటులో వుంది. 10 నిమిషాల నిడివి మాత్రమే వున్న ఈ షార్ట్ ఫిలింలో ‘బటర్ ‌ఫ్లై’ ఫేమ్ నిహాల్ మేల్ లీడ్ పోషించారు. ఈ షార్ట్ ఫిలింలో అనుపమ కెమెరా పనితనానికి విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com