నిఖిల్‌కి ‘కార్తికేయ’లా, తేజుకి ‘విరూపాక్ష’ అవుతుందా.?

- April 12, 2023 , by Maagulf
నిఖిల్‌కి ‘కార్తికేయ’లా, తేజుకి ‘విరూపాక్ష’ అవుతుందా.?

ఈ మధ్య సినిమాలు ఎవరికి ఎందుకు ఎలా.? నచ్చేస్తున్నాయో అర్ధం చేసుకోవడం కష్టంగా వుంది. ‘కార్తికేయ’ సినిమాకి అంతులేని పట్టం కట్టేసిన సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రజాదరణ పొందింది.

రజనీకాంత్‌లాంటి స్టార్ ‘చంద్రముఖి’ సినిమా చేస్తే అదో ట్రెండ్ సెట్టర్ అయ్యింది. అలాగే అంధవిశ్వాసాలు అని కొట్టి పడేసే చేతబడి నేపథ్యంలో సినిమా చేస్తే జనానికి కనెక్ట్ అవుతుందా.? 

‘విరూపాక్ష’ అలాంటి సినిమానే. మెగా మేనల్లుడు తన జోనర్‌కి దూరంగా ఈ కొత్త జోనర్‌తో మెగా ఫ్యాన్స్‌ని ఇంప్రెస్ చేసేందుకు ముందుకొస్తున్నాడు. ఆడియన్స్ కనెక్ట్ అవుతారా.?
తెలియాలంటే మరికొద్ది రోజులు మాత్రమే ఆగాల్సి వుంది. ఈ నెలాఖరుకు ‘విరూపాక్ష’ సినిమా ధియేటర్లలో సందడి చేసేందుకు ముస్తాబవుతోంది. సందడి కాదు, ప్రేక్షకులకు సరికొత్త హారర్ థ్రిల్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. 

సుకుమార్ చెయ్యి పడిందంటే, ఈ సినిమా కథను తక్కువ చేయడానికి లేదు. ట్రైలర్‌ని చాలా ఇంటెన్స్‌తో కట్ చేశారు. ఖచ్చితంగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో ‘విరూపాక్ష’ ఓ మైల్ స్టోన్‌లాంటి మూవీ అవుతుందని అంటున్నారు. 

ఒకవేళ అదే జిరగితే, మళ్లీ ఈ ఫార్ములాలో భవిష్యత్ కథలు రూపుదిద్దుకోవడం పక్కా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com