ఊర్వశితో అఖిల్ స్పెషల్ సాంగ్ అదిరిపోయేలా.!
- April 12, 2023
‘బాస్ పార్టీ’ అంటూ టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి సరసన స్పెషల్ స్టెప్పులు ఇరగదీసింది బాలీవుడ్ అందాల తార ఊర్వశి రౌతెలా. సినిమా సూపర్ హిట్ అవ్వడం, పాట కూడా ఓ ఊపు ఊపేయడంతో ఊర్వశి రౌతెలాకి టాలీవుడ్‌లో ఆఫర్లు పోటెత్తుతున్నాయట.
అందులో భాగంగానే ఆల్రెడీ బోయపాటి - రామ్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఆఫర్ కొట్టేసింది ఊర్వశి రౌతెలా. తాజాగా ‘ఏజెంట్’ సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేస్తోందట ఊర్శశి.
అఖిల్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమా ఏప్రిల్ నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనూ ఊర్వశి ఐటెం సాంగ్ చేసిందనీ తాజా సమాచారమ్.
అఖిల్ మంచి డాన్సర్. ఊర్వశి డాన్స్ చేస్తే ఎంతటి వారైనా నిలబడి చూడాల్సిందే. మరి, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోయే మాస్ మసాలా ఐటెం సాంగ్ ఎలా వుండబోతోందో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







