‘ఉస్తాద్’ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.!
- April 12, 2023
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రస్తుతం సెట్స్ మీద వున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం హీరోయిన్‌గా మొదట పూజా హెగ్దేని అనుకున్నారు.
కానీ, అనూహ్యంగా ‘ధమాకా’ బ్యూటీ శ్రీలీల వచ్చి చేరిన సంగతి తెలిసిందే. కన్‌ఫామ్ అవ్వడమే కాదండోయ్ ఏకంగా పాప సెట్స్‌లో అడుగు పెట్టేసింది కూడా.
హరీష్ శంకర్ అండ్ టీమ్ శ్రీలీలకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. కాగా, ప్రస్తుతం శ్రీలీల, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతోన్న బాలయ్య 108లోనూ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే, రామ్ పోతినేనితో ఓ సినిమా చేస్తోంది. బోయపాటి శీను ఈ సినిమాకి దర్శకుడు. దీంతో పాటూ, మరిన్ని అవకాశాలు శ్రీలీల కోసం టాలీవుడ్‌లో కాసుక్కూర్చున్నాయ్.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







