సైనస్ బాధిస్తోందా.? తక్షణ ఉపశమనం.!
- April 12, 2023సైనస్ చాలా ఇరిటేటింగ్ సమస్య. సీజన్ మారినప్పుడల్లా ఈ సమస్య తీవ్రతరం అవుతుంటుంది. ఎప్పుడూ తలనొప్పి వేధించడం, ముఖం భారంగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తదితర లక్షణాలను సైనస్ సమస్యగా చెబుతారు.
సైనస్‌తో బాధపడేవారు నిద్ర పోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు ఇంగ్లీష్ మెడిసన్స్ అందుబాటులో వున్నాయ్ కానీ, శాశ్వతంగా సమస్యను తీర్చలేవీ మెడిసెన్స్.
అయితే, తాత్కాలిక ఉపశమనంగా ఇంటి చిట్కాలు కొన్ని తెలుసుకుందాం.
1. రాత్రి పడుకునే ముందు కుండనీటి ఆవిరి సైనస్‌కి మంచి ఉపశమనంగా చెబుతున్నారు. కుండలో నీటిని మరిగించి, కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆకుల్ని లేదా జింతా తిలిస్మాత్ వేసి 10 నిమిషాలు ఆవిరి పీల్చి చూడండి.
2. నాసికా భాగాల్లో పేరుకుపోయిన శ్లేష్మం కరిగించేందుకు ఉప్పు నీరు బాగా ఉపకరిస్తుంది. గోరువెచ్చని నీటిలో కాసింత గడ్డ ఉప్పు (రాక్ సాల్ట్) వేసి ముక్కులో ఫ్లష్ చేస్తే ఉపశమనం వుంటుంది.
3. అల్లం మరిగించిన నీటిని తాగినా మంచి ఫలితం వుంటుంది.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..