మీ కిడ్నీలు సేఫ్‌గా వున్నాయా?
- April 14, 2023శరీరంలో ఏ పార్ట్‌కి అనారోగ్యం వచ్చినా అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. గుండె తర్వాత శరీర భాగాల్లో ప్రధానమైనవి కిడ్నీలు. కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే అనేక రకాల వ్యాధులు చుట్టుముడతాయ్.
కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకోవాలంటే మన ఆహారపు అలవాట్లే కీలకం. కిడ్నీల ఆరోగ్యానికి కొన్ని రకాల ఆహార పదార్ధాలను అవైడ్ చేయాల్సి వుంటుంది. అవేంటో తెలుసుకుందాం.
వేసవి వచ్చిందంటే, కొందరికి సోడా ఎక్కువగా తాగే అలవాటుంటుంది. సోడాలో పాస్ఫరస్ ఎక్కువగా వుంటుంది. కిడ్నీలకు ఇది హానీ చేస్తుంది. సో, ఈ అలవాటు అధికంగా వుంటే, తగ్గించుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే ఆయిల్ ఫుడ్స్ కూడా. ఆయిల్ ఫుడ్స్ కేవలం కిడ్నీలకే కాదు, ఆరోగ్యానికి ఎంత మాత్రమూ మంచివి కాదు. అయితే ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ అలవాటుంటే, వారి కిడ్నీలు తొందరగా పాడవుతాయ్.
అవకాడో పండు కూడా ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని కొన్ని సర్వేల ద్వారా తేలింది. ఖరీదైన ఈ పండును ఎంత తక్కువగా తింటే అంత మంచిది. ఇందులో పొటాషియం ఎక్కువ మోతాదులో వుంటుంది. ఇది కిడ్నీలకు హాని చేస్తుంది. అలాగే సోడియం ఎక్కువగా వుండే ఆహార పదార్ధాలను కూడా మితంగా తీసుకుంటే కిడ్నీలకు మంచిది.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు