విజిట్ వీసా: గడువు దాటితే బ్లాక్‌లిస్ట్, పరారీ అభియోగాలు
- April 15, 2023
యూఏఈ: విజిట్ వీసాలపై వచ్చే పర్యాటకులు ఒక్కరోజు కూడా ఎక్కువ ఉండరాదని.. అటువంటి పర్యాటకులను బ్లాక్‌లిస్ట్‌లో పెడతారని, పరారీలో ఉన్నట్లు ఛార్జ్ చేయబడవచ్చని ట్రావెల్ ఏజెంట్లు చెప్పారు. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న వ్యక్తులు యూఏఈ, ఇతర GCC దేశాలలోకి ప్రవేశించకుండా నిషేధించబడతారని కొంతమంది ట్రావెల్ ఏజెంట్లు ధృవీకరించారు. వీసా గడువు ముగిసిన సందర్శకులు అవసరమైన ఏర్పాట్లు చేసి వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని వారు కోరారు.
సందర్శకులు పరారీలో ఉన్నట్లు ఏజెంట్లు ఎందుకు చెబుతారంటే..
30 లేదా 60 రోజుల సందర్శన వీసాపై యూఏఈలోకి ప్రవేశించిన సందర్శకులు, ఏజెంట్ స్పాన్సర్‌షిప్ కింద వీసాను స్వీకరిస్తారు. సందర్శకులు అంతకంటే ఎక్కువరోజులు ఉంటే ఏజెంట్ ఆ భారాన్ని భరించవలసి ఉంటుంది. "మా భద్రత కోసం అలాంటి సందర్శకులు పరారీలో ఉన్నట్లు మేము నివేదిస్తాము" అని రూహ్ టూరిజం అండ్ ట్రావెల్ LLC సేల్స్ డైరెక్టర్ లిబిన్ వర్గీస్ చెప్పారు. “ఇక్కడ డబ్బు విషయం కాదు. పోర్టల్‌లో మాకు నిర్దిష్ట సంఖ్యలో వీసా దరఖాస్తులు ఇవ్వబడతాయి. సందర్శకులు ఎక్కువ కాలం గడిపినట్లయితే కొత్త వీసాల కోసం దరఖాస్తు చేయలేరు. కొన్నిసార్లు మా పోర్టల్ ను కూడా బ్లాక్ చేస్తారు. ”అని వర్గీస్ వివరించారు. ఏజెంట్లు తమ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి ఓవర్‌స్టే జరిమానాలు వర్తింపజేస్తారని కూడా స్పష్టం చేశారు. “తప్పక చెల్లించాల్సిన కనీస పరారీ పెనాల్టీ Dh2,000, ఇది ప్రతిరోజూ పెరుగుతుంది. సందర్శకులు ఎక్కువ కాలం గడిపే రోజుల సంఖ్యను బట్టి ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది, ”అని ఓ ట్రావెల్ ఏజెంట్ అన్నారు.
పరారీలో ఉన్నట్లు అభియోగాలు నమోదైతే..
దేశం నుండి తిరిగి వెళ్లేందుకు సదరు వ్యక్తి ముందుగా వారి వీసాను ప్రాసెస్ చేసిన ఏజెంట్‌ని సంప్రదించాలి. తదుపరి దశలో ఏజెంట్‌కు సంబంధిత జరిమానా చెల్లించడం, తద్వారా పరారీ కేసును పోర్టల్‌లో ఉపసంహరించుకుంటారు. అనంతరం సందర్శకుడు దేశం నుండి వెళ్లడానికి అవుట్‌పాస్ మంజూరు అవుతంది. పరారీ చట్టరీత్యా నేరమని, అభియోగాలు మోపిన పర్యాటకులను పోలీసులు అరెస్టు చేయవచ్చని ఏజెంట్లు చెబుతున్నారు. సందర్శకులు ఎయిర్‌పోర్ట్‌లో వీసా స్టేటస్‌ను ఏర్పాటు చేయలేకపోతే, వారిని బహిష్కరించే అవకాశం ఉందని అని సిద్ధిక్ ట్రావెల్స్ యజమాని తాహా సిద్దిక్ అన్నారు. ప్రతి సందర్శకుడు తమ స్పాన్సర్‌తో నిరంతరం కమ్యూనికేట్ కావాలని చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







