కల్తీ మద్యం తాగి 8 మంది మృతి

- April 15, 2023 , by Maagulf
కల్తీ మద్యం తాగి 8 మంది మృతి

పాట్నా: సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బీహార్ లో కల్తీ మద్యం ఏరులైపారుతోంది. కొందరు వ్యాపారులు లాభాలే పరమావధిగా భావిస్తున్నారు. అక్రమంగా కల్తీ మద్యం తయారు చేసి, విక్రయిస్తూ ప్రజలు ప్రాణాలు తీస్తున్నారు. కల్తీ మద్యానికి బలైన ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.

శనివారం (ఏప్రిల్15)న రాష్ట్రంలోని మోతిహారిలో కల్తీ మద్యం తాగి 8 మంది మృతి చెందారు. మరో 25 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం 2016 ఎప్రిల్ లో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, వినియోగంపై సంపూర్ణ నిషేధం విధించింది. అయినా రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా తయారైన కల్తీ మద్యం తాగి అనేక మంది తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com