యూఏఈలో పెరుగుతున్న ఫ్లూ కేసులు.. పిల్లలకు టీకాలు వేయించారా?
- April 15, 2023
యూఏఈ: ముక్కు కారటం, జ్వరం లేదా గొంతు నొప్పితో సహా ఫ్లూ లక్షణాలతో ఎక్కువ మంది తమ వద్దకు వస్తున్నట్లు యూఏఈలోని వైద్యులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ఇన్ఫ్లుయేంజా కేసులు పెరుగుతున్నప్పటికీ, ఇవి స్వల్పంగా ఉన్నాయని.. ఆందోళన కలిగించేంత ఎక్కువగా లేవని ఆరోగ్య నిపుణులు తెలిపారు.ముఖ్యంగా పిల్లలను ఫ్లూ నుంచి రక్షించడానికి టీకాలు వేయించడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. “ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోని పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సినేషన్ షాట్లను తప్పనిసరిగా నిర్ణీత వ్యవధుల్లో వేయించాలి. పిల్లలకు వార్షిక ఫ్లూ షాట్‌ను కూడా ఇవ్వాలని నేను సిఫార్సు చేస్తున్నాను" అని అబుధాబి సిటీలోని అహలియా హాస్పిటల్‌లోని శిశువైద్యుడు డాక్టర్ అమృత్ లాల్ సోనీ అన్నారు.
దుబాయ్‌లోని మీడియర్ హాస్పిటల్‌లోని శిశువైద్యుడు డాక్టర్ జమున రఘురామన్ మాట్లాడుతూ.. పాఠశాల పునఃప్రారంభమైన తర్వాత ఫ్లూ లక్షణాలతో ఇబ్బందులు పడే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. వేసవి సెలవుల తర్వాత విద్యార్థులు ఒకేచోట గుమ్మికూడటం కారణంగా.. గొంతు ఇన్ఫెక్షన్లు, అధిక జ్వరం , శరీర దద్దుర్లు, ఇన్ఫ్లుయేంజా మరియు అడెనోవైరస్లు ప్రబలే అవకాశం ఉందని డాక్టర్ సోనీ పేర్కొన్నారు.
జాగ్రత్తలు తీసుకోండి
పిల్లలు మంచి చేతుల పరిశుభ్రత పాటించాలని వైద్యులు చెప్పారు. పాఠశాలలో లేదా బయట భోజనం చేసిన తర్వాత వారు తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. వడకట్టిన లేదా మరుగపెట్టిన నీటిని మాత్రమే తాగాలి. వీలైనప్పుడల్లా తరగతుల్లో లేదా బస్సుల్లో ఉన్నప్పుడు మాస్క్ ధరించాలి. అలాగే షేక్ హ్యాండ్ శానిటైజర్లను తరచూగా ఉపయోగించాలని డాక్టర్ సోని తెలిపారు. పిల్లలు ఫిట్‌గా ఉండేందుకు తప్పనిసరిగా హైడ్రేటెడ్‌గా ఉండాలని, ఆరోగ్యకరమైన ఆహారం తినాలని సూచించారు.
తాజా వార్తలు
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!
- కువైట్ లోని నేచర్ రిజర్వ్ లో వేట..ఇద్దరు అరెస్టు..!!
- దోహా ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!







