మక్కాలో ప్రత్యేక ప్రార్థనలకు హాజరైన రెండు మిలియన్ల ఆరాధకులు

- April 18, 2023 , by Maagulf
మక్కాలో ప్రత్యేక ప్రార్థనలకు హాజరైన రెండు మిలియన్ల ఆరాధకులు

మక్కా: మక్కాలోని గ్రాండ్ మస్జీదు, మదీనాలోని ప్రవక్త మస్జీదు వద్ద ఇషా, 27న తరావీహ్, ఖియాముల్లైల్ ప్రత్యేక రాత్రి ప్రార్థనలు చేసేందుకు రెండు మిలియన్లకు పైగా ఆరాధకులు తరలివచ్చారు.రెండు పవిత్ర మస్జీదుల వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ విశ్వాసకులు తమ ఆచారాలను సులభంగా, సౌకర్యంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ప్రెసిడెన్సీ అధిపతి షేక్ అబ్దుల్ రెహ్మాన్ అల్-సుదైస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దాదాపు ఒకటిన్నర మిలియన్ల మంది ఉమ్రా యాత్రికులు, ఆరాధకులు తరావీహ్, ఖియాముల్లైల్ ప్రత్యేక రాత్రి ప్రార్థనలకు హాజరయ్యారని అంచనా.ఇక గ్రాండ్ మస్జీదులో షేక్ సుడైస్ నేతృత్వంలోని ప్రత్యేక ప్రార్థనతో ఈ ప్రార్థనలు ముగిసాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com