బోగస్ జాబ్ రిక్రూట్‌మెంట్‌పై వార్నింగ్ అలెర్ట్

- April 19, 2023 , by Maagulf
బోగస్ జాబ్ రిక్రూట్‌మెంట్‌పై వార్నింగ్ అలెర్ట్

బహ్రెయిన్: ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌ల పెరుగుదల నేపథ్యంలో బహ్రెయిన్ వార్నింగ్ అలెర్ట్ జారీ చేసింది. బోగస్ జాబ్ రిక్రూట్‌మెంట్‌పై జాగ్రత్తగా ఉండాలని, జెన్యూన్ జాబ్ పోర్టల్‌లను పరిశీలించి.. సంబంధిత అధికారులను సంప్రదించి నిర్ధారించుకోవాలని ఉద్యోగార్థులను అధికారులను కోరారు. ఉద్యోగార్థులను సంప్రదించడానికి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్,  ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఆన్‌లైన్ ప్రకటనలను మోసగాళ్లు ఇస్తారని గుర్తుచేశారు. అనేక సందర్భాల్లో, రాజ్యంలో మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చే ఏజెంట్లు "ప్రాసెసింగ్ ఫీ" పేరిట అభ్యర్థుల నుంచి దండుకొని మోసం చేస్తారని తెలిపారు. అలాగే వివిధ లింకులతో సోషల్ మీడియాలో ఉద్యోగార్ధులను ఆకర్షిస్తూ.. డబ్బు మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల కొన్ని సంస్థలు ఉద్యోగుల నియామకానికి సంబంధించి ప్రముఖ సోషల్ మీడియా సైట్స్ తో సహా అనేక జాబ్ పోర్టల్‌లలో నకిలీ ప్రకటనలు ఇచ్చిన నేపథ్యంలో ఈ వార్నింగ్ అలెర్ట్ ను అధికారులు జారీ చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com